న్యూఢిల్లీ: మాజీ సీఆర్పీఎఫ్, ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ అనీశ్ దయాళ్ సింగ్ జాతీయ భద్రతా ఉప సలహాదారుగా (డిప్యూటీఎన్ఎస్ఏ) నియ మితులైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. జమ్ము కశ్మీర్, నక్సల్, ఈశాన్య రాష్ర్టాల్లో తిరుగుబాట్లు సహా దేశ అంతర్గత వ్యవహారాలకు ఆయన ఇన్చార్జిగా ఉంటారు.
మణిపూర్ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన 30 ఏండ్లు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేశారు. అనంతరం ఐటీబీపీ, సీఆర్పీఫ్లకు నాయకత్వం వహించారు. సీఆర్పీఎఫ్ చీఫ్‌గా ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.