న్యూఢిల్లీ : ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త అనిరుద్దాచార్య(Aniruddhacharya) మద్దతుదారులు ఢిల్లీ విమానాశ్రయం వద్ద మహిళా జర్నలిస్టుపై అటాక్ చేశారు. ఇటీవల మహిళలపై అనిరుద్దాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏబీపీ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టు అజాతికా సింగ్‌పై ఆయన మద్దతుదారులు దాడి చేశారు. అనిరుద్దాచార్య ముందే ఈ ఘటన జరిగింది. లేడీ రిపోర్టర్ కురులను పట్టి గుంజేశారు. గతంలో అమ్మాయిలు 14 ఏళ్లలో పెళ్లి చేసుకుని కుటుంబాలను చక్కదిద్దేవాళ్లు అని, కానీ ఇప్పుడు 25 ఏళ్ల మహిళ అనేక మందితో తిరుగుతోందన్నట్లు ఇటీవల అనిరుద్దాచార్య కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన సారీ చెప్పారు. అయితే ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఆ వివాదం గురించి లేడీ రిపోర్టర్ ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకు అనిరుద్దాచార్య సమాధానం ఇవ్వలేదు. నవ్వుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన భక్తులు ఆ లేడీ జర్నలిస్టుపై చేయి చేసుకున్నారు.
बेटियों का उठाया सवाल, अनिरुद्धाचार्य ने कराया बवाल
abp न्यूज़ की रिपोर्टर के साथ समर्थक ने की बदसलूकी#GetWellSoonBaba के साथ पोस्ट करें
बाबा और भक्तों को सिखाएं मर्यादा!@Ajatikaa #Aniruddhacharya #ABPNews pic.twitter.com/jJxjABwtn9
— ABP News (@ABPNews) August 7, 2025