భోపాల్: పెళ్లి చేసుకోమని కోరిన ప్రియురాలిని ప్రియుడు దారుణంగా కొట్టాడు. ఆమెను కిందపడేసి కాలితో పలుమార్లు తన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గ్రామంలోని రోడ్డుపై ఒక యువ జంట నడుచుకుంటూ వెళ్తున్నది. తనను పెళ్లి చేసుకోవాలని వెంట ఉన్న యువకుడితో యువతి అన్నది. దీంతో అతడు తీవ్ర ఆగ్రహం చెందాడు. మొదట ఆ యువతి చెంపపై కొట్టాడు. ఆ తర్వాత ఆమె జుట్టుపట్టి లాగి కిందకు తోసేశాడు. ఆపై కింద పడిన ఆమెను తన కాళ్లతో దారుణంగా కొట్టాడు. ఆమె కాళ్లు, చేతులతోపాటు ముఖంపైనా కాలితో బలంగా తన్నాడు. దీంతో ఆ యువతి గాయపడింది.
కాగా, ఆ సమయంలో అక్కడున్న కొందరు ఈ దారుణాన్ని కళ్లప్పగించి చూశారు. ఏ ఒక్కరు కూడా ఆ యువతిని కాపాడేందుకు ముందుకు రాలేదు. పైగా తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలో దీనిని రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరకు రేవా పోలీసుల దృష్టికి ఇది వెళ్లింది. దీంతో సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు. వీడియో క్లిప్‌లోని ఆ జంటను గుర్తించి యువతిపై దాడి చేసిన యువకుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
इस राक्षस को धारा 151 की खानापूर्ति करके छोड़ दिया एमपी के रीवा की पुलिस ने!
परिवार अगर खूंखार के खौफ से शिकायत नहीं करवाएगा,तो क्या पुलिस इससे भी खौफनाक अगली वारदात के लिए राक्षस को आजाद छोड़ देगी!वीडियो देखें,बताएं क्या ये घटना 151 की है.!@ChouhanShivraj @drnarottammisra pic.twitter.com/DUr9k44oue— Govind Gurjar (@Gurjarrrrr) December 24, 2022