ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్..ఆస్ట్రేలియన్-అమెరికన్ నటుడు. ఫిలిం ప్రొడ్యూసర్, బిజినెస్‌మేన్, బాడీ బిల్డర్, రాజకీయ నాయకుడు. 2003-2011 వరకు కాలిఫోర్నియా గవర్నర్‌గా పనిచేశారు. టైమ్ మ్యాగజైన్ 2004-2007 మధ్య ప్రపంచంలోనే 100 మంది ప్రభావవంత వ్యక్తుల్లో ఒకరిగా ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్‌ను ప్రకటించింది. కాగా, ఆర్నాల్డ్ స్వార్జ్నెగ్గర్పై ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
ఓ గోడపై ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ బాడీ బిల్డింగ్ ఫొటో వేశారు. దానిపక్కనే ఆర్నాల్డ్ సుభాష్‌నగర్ అని రాసి ఉంది. ఇది చూసి ఆనంద్ మహీంద్ర ఆశ్చర్యపోయారు. ఆ ఫొటోను ఆనంద్ మహీంద్ర ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఇది భారతీయుల గొప్పతనం.. మనం దేన్నైనా, ఎవరినైనా దత్తత తీసుకుంటాం..మన నేటివిటీకి దగ్గట్లు మార్చేసుకుంటాం..ఇకపై నేను ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ అని పిలిచేందుకు కష్టపడక్కర్లేదు.. ఆర్నాల్డ్ సుభాష్‌నగర్ అని పిలువొచ్చు.’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. చాలామంది తమకు పలకడం రాని పేర్లను మార్చి ఎలా పలుకుతున్నామో కామెంట్లలో చెప్పారు.
This is the ‘Great Indian Funnel.’ We adopt everything and everyone & give them Indian Avatars! हम पूरी दुनिया को अपनाते हैं. (And I wonder why I used to try so hard to pronounce ‘Schwarzenegger’ when I could have just called him Mr. Subhashnagar..) pic.twitter.com/zqOZN05k2N
— anand mahindra (@anandmahindra) June 16, 2022