ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేసిన ‘మేక పిల్లల’ వీడియో వైరల్

ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర తాజాగా ట్వీట్ చేసిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. మేక పిల్లలు తోకలు ఊపుతూ పాలు తాగుతున్న వీడియోను శనివారం ఆయన షేర్ చేశారు. మేకల సంరక్షకుడు పాల సీసాలను ఒక స్టాండ్‌లో ఉంచుతాడు. బాగా ఆకలిగా ఉన్న మేక పిల్లలు ఆ పాల సీసాలకు బిగించిన పీకల ద్వారా పాలు తాగుతుంటాయి. ఈ సందర్భంగా తమ పొట్టి తోకలను బాగా ఊపుతుంటాయి. ‘ఇది ఒక అందమైన జంతువుల వీడియో మాత్రమే కాదు. ప్రపంచం కొత్త శక్తిని కనుగొన్నట్లు నేను భావిస్తున్నాను. #టెయిల్పవర్. ఊగే తోకలను టర్బైన్, ప్రీస్టోకు కలిపితే మీకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.. ’ అని అందులో పేర్కొన్నారు.
It’s supposed to be just a cute animal video but I think the world may have discovered a new form of energy: #tailpower Hitch those wagging tails to a turbine & presto, you have electricity… 😊 pic.twitter.com/7r6m1RjkTn
— anand mahindra (@anandmahindra) April 10, 2021
కాగా, ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇప్పటికే సుమారు 2 లక్షల మంది దీనిని వీక్షించారు. నెటిజన్లు కూడా ఈ వీడియోను బాగా లైక్ చేశారు. ‘ఖచ్చితంగా ఈ ‘కొత్త శక్తి’ విద్యుత్ ఉత్పత్తిలో వినూత్న సాంకేతిక పరిజ్ఞానంగా నిలుస్తుంది’ అని ఒకరు బదులిచ్చారు. మరి కొందరు ఫన్నీగా కామెంట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

