న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ స్టోక్స్ విరోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌కు రెండోసారి వరల్డ్‌కప్‌ను అందించిన స్టోక్స్‌పై ప్రశంసలు వర్షం కురుస్తూనే ఉంది. ప్రస్తుతం ఆ జాబితాలో వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర కూడా చేరారు. తన ట్వీట్లతో ప్రజల్ని ఆలోచింపజేసే ఆనంద్ మహేంద్ర తాజా ట్వీట్లో స్టోక్స్‌ను విశేషంగా కొనియాడారు. బెన్ స్టోక్స్ నరాల నుంచి ద్రవాల్ని తీసి విక్టరీ వ్యాక్సిన్‌ను తయారు చేయాలని సీరం ఇన్స్టిట్యూట్ను కోరారు.
Hello, is that the @SerumInstIndia ? Could you please extract some fluid from the veins of @benstokes38 & make a vaccine out of it? A #VictoryVaccine. Because this gentleman just doesn’t know how to lose… (Where can I sign up for the first dose?)#T20WorldCup #ENGvPAK https://t.co/ToOp5Kyzmq
— anand mahindra (@anandmahindra) November 13, 2022
చాలా ఆసక్తికరంగా ఆనంద్ మహేంద్ర ఆ ట్వీట్ చేశారు. హలో.. ఇది సీరమ్ ఇన్స్టిట్యూటేనా.. బెన్‌స్టోక్స్ నరాల నుంచి ద్రవాన్ని తీసి.. దాంతో వ్యాక్సిన్ తయారు చేయగలరా అని జోకింగ్‌గా అడిగారు. స్టోక్స్ నుంచి విక్టరీ వ్యాక్సిన్ తయారు చేయాలని కోరారు. ఎందుకంటే ఆ జెంటిల్మెన్కు ఓడిపోవడం తెలియదన్నారు. ఇక ఆ తొలి డోసు ఎక్కడ తీసుకోవాలో చెప్పండి అని కూడా ఆనంద్ మహేంద్ర తన ట్వీట్లో ప్రశ్నించారు.
ఫైనల్లో పాక్ విసిరిన టార్గెట్‌ను ఛేజ్చేసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ 52 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. 2019లో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో కూడా స్టోక్స్ చివరి వరకు ఆడి ఇంగ్లండ్‌కు కప్‌ను అందించాడు. ఆ విక్టరీలకు చెందిన ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఆనంద్ మహేంద్ర తాజా కామెంట్ చేశారు.