Dalit woman | బీహార్‌లో దారుణం.. దళిత మహిళను వివస్త్ర చేసి మూత్రం తాగించారు
బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొన్నది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు.
Dalit woman | పాట్నా, సెప్టెంబర్ 24: బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొన్నది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు. అంతటితో అగకుండా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా కర్రలతో కొట్టారు. బలవంతంగా మూత్రం తాగించి మృగాల్లా వ్యవహరించారు. ఈ దుశ్చర్య శనివారం రాత్రి చోటుచేసుకొన్నది.
బాధిత మహిళ తలపై బలమైన గాయాలతో ప్రస్తుతం దవాఖానలో చికిత్స తీసుకొంటున్నది. ఆమె పరిస్థితి విషయంగా ఉన్నదని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన ప్రమోద్ సింగ్, అన్షు తండ్రి కుమారులని పోలీసులు పేర్కొన్నారు. వీరు మరో నలుగురు వ్యక్తులతో కలిసి బాధిత మహిళ ఇంటికెళ్లి, ఆమెను బలవంతంగా వారి ఇంటికి తీసుకొచ్చారని వివరించారు. నిందితుల నుంచి మహిళ ఎలాగొలా తప్పించుకొని ఇంటికి చేరిందని, ప్రస్తుతం ఇద్దరు నిందితుతు పరారీలో ఉన్నారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

