అయోధ్య, డిసెంబర్ 17: అయోధ్యలో కాశీ విశ్వనాథుని ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదుపై శివుని నంది పేరుతో కొత్త పిటిషన్ దాఖలైంది. మసీదు కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న అసలు శివాలయాన్ని పునరుద్ధరించడానికి న్యాయస్థానం అనుమతి ఇవ్వాలని కోరుతూ నంది మహరాజ్ తన భక్తుల ద్వారా వారణాసి జిల్లా కోర్టులో కేసు దాఖలు చేసింది. ముస్లింలు చట్ట విరుద్ధంగా నిర్మించిన మసీదు కట్టడాన్ని తొలగించి, వాస్తవానికి అదే స్థలంలో కొలువై ఉన్న శివుని ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరింది.