హైదరాబాద్, జనవరి 24 (నమస్తేతెలంగాణ) : దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ అమూల్ కీలక నిర్ణయం తీసుకున్నది. అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ టీ స్పెషల్ లీటరు పాల ప్యాకెట్‌పై రూపాయి తగ్గించింది. తాజా నిర్ణయంతో లీటర్ అమూల్ గోల్డ్ పాల ధర రూ.66 నుంచి రూ.65కి, అమూల్ టీ స్పెషల్ మిల్క్ లీటర్ ప్యాకెట్ ధర రూ.61కి, అమూల్ తాజా పాల ధర లీటరు రూ.54 నుంచి రూ.53కి తగ్గింది. కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. కాగా, అమూల్ గత ఏడాది జూన్‌లో పాల ధరలను లీటరుకు రూ.2 పెంచిన విషయం తెలిసిందే.