అమృత్సర్: ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్న పంజాబ్ పోలీసులు.. తాజాగా అతని ప్రధాన అనుచరుడు పాపల్‌ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేశారు.
వీరిద్దరూ 20 రోజుల క్రితం పంజాబ్ పోలీసుల వలలో చిక్కినట్టే చిక్కి చేజారారు. అమృత్సర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కథునంగల్ ఏరియాలో సోమవారం ఉదయం పాపల్‌ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.