అరెస్టుకు భయపడను!
రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న ఖలిస్థానీ నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది.
- వీడియో విడుదల చేసిన అమృత్‌పాల్
న్యూఢిల్లీ: గత 12 రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న ఖలిస్థానీ నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. ఎప్పుడు రికార్డు చేశారనే వివరాలు లేని ఈ వీడియో సోషల్ మీడియాలో బుధవారం ప్రత్యక్షమైంది. చేతనైతే తనను అరెస్టు చేసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను సవాల్ చేసేలా అందులో మాట్లాడారు. ‘నేను ఇంతకుముందు అరెస్టుకు భయపడలేదు. ఇప్పుడు కూడా భయపడను’ అని పేర్కొన్నారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బైసాఖీ రోజున జరిగే సర్బత్ ఖల్సా కార్యక్రమంలో దేశవిదేశాల్లోని సిక్కులందరూ పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం చేసిన మోసాన్ని గుర్తుంచుకోవాలని, పంజాబ్ సమస్యలను పరిష్కరించాలంటే సిక్కులు అందరూ కలిసి ఉండాలని అందులో అన్నారు. అయితే అమృత్‌పాల్ ఇప్పటికే దేశం నుంచి పారిపోయాడని, ఈ వీడియో విదేశాల నుంచి సోర్స్ చేయబడిందని, అంతేకుండా రెండు రోజుల పాతదిగా కనిపిస్తున్నదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. యూకే హ్యాండిల్స్ అమృత్‌పాల్ వీడియోను పోస్టు చేసివుంటాయని తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

