న్యూఢిల్లీ: సమాచార, ప్రసార శాఖ మాజీ కార్యదర్శి అమిత్ ఖరేను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారుగా నియమించారు. ఈయన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉన్నత విద్య శాఖ కార్యదర్శిగా పనిచేసి సెప్టెంబర్ 30న రిటైర్ అయ్యారు. సమర్థవంతమైన, క్రమశిక్షణ కలిగిన బ్యూరోక్రాట్‌గా అమిత్‌కు పేరుంది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా గతేడాది కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడంతోపాటు సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా డిజిటల్ మీడియా నియంత్రణలకు సంబంధించి కూడా కీలక మార్పులు తీసుకొచ్చిన ఘనత అమిత్ ఖరే సొంతం. ప్రధాని మంత్రి సలహాదారులుగా పీకే సిన్హా, అమర్జీత్ సిన్హా ఈ ఏడాది తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి స్థానంలో అమిత్ ఖరే.. పీఎంవోలోకి వెళ్లనున్నారు. పూర్తి పారదర్శకతతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని అమిత్‌కు పేరుంది.