Derek O’Brien | ‘ఇండియా’ బ్లాక్‌లో టీఎంసీ భాగమే: డెరెక్ ఓబ్రియన్
Derek O'Brien | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌లో భాగమా కాదా అన్న దానిపై ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ స్పష్టత ఇచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆదివారం రాంలీలా మైదానంలో ప్రతిపక్షాల కూటమి నిర్వహించిన ‘లోక్తంత్ర బచావో’ సభలో ఆయన పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌లో భాగమా కాదా అన్న దానిపై ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ (Derek O’Brien) స్పష్టత ఇచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆదివారం రాంలీలా మైదానంలో ప్రతిపక్షాల కూటమి నిర్వహించిన ‘లోక్తంత్ర బచావో’ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డెరెక్ ఓబ్రెయిన్ ‘భారత’ కూటమిలో టీఎంసీ ఉంది, ఉంటుందని తెలిపారు. ప్రతిపక్షాల మెగా ర్యాలీ బీజేపీపై ప్రజాస్వామ్యం పోరాటమని అన్నారు. ఈ మేరకు రాసి ఉన్న బ్లాక్ టీ షర్టును ఆయన ధరించారు.
కాగా, పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను టీఎంసీ ప్రకటించింది. ‘ఇండియా’ బ్లాక్‌లో భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, వామపక్షాలకు ఎలాంటి సీట్లు కేటాయించబోమని మమతా బెనర్జీ ముందుగానే స్పష్టం చేశారు. అలాగే ఈ రెండు పార్టీలపై ఆమె మండిపడ్డారు. బెంగాల్లో టీఎంసీకి వ్యతిరేకంగా బీజేపీతో కలిసి కాంగ్రెస్, సీపీఎం పనిచేస్తున్నాయని ఆరోపించారు.
#WATCH | INDIA alliance rally: TMC MP Derek O'Brien says, "…All India Trinamool Congress (TMC) is very much was, is and will be part of the INDIA alliance. This is a fight of BJP versus democracy…" pic.twitter.com/5q2YuoHRCO
— ANI (@ANI) March 31, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

