UP govt cancels police exam | పేపర్ లీక్ ఆరోపణలు.. యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష రద్దు
UP govt cancels police exam | ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఆరు నెలల్లో పరీక్ష తిరిగి నిర్వహిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. (UP govt cancels police exam) ఆరు నెలల్లో పరీక్ష తిరిగి నిర్వహిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. పేపర్ లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిబ్రవరి 17న, 18న ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష నిర్వహించారు. రోజుకు రెండు షిఫ్టుల్లో జరిగిన ఈ పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ అయ్యినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీని కోసం కొన్నిరోజులుగా నిరసనలు చేస్తున్నారు.
కాగా, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం స్పందించింది. ఆరు నెలల్లోగా పరీక్షను తిరిగి నిర్వహిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ‘పరీక్షల పవిత్రలో ఎలాంటి రాజీ ఉండదు. యువత కష్టార్జితంతో ఆడుకున్న వారిని వదిలిపెట్టబోం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీంతో ఆందోళన చేస్తున్న అభ్యర్థులు పరీక్ష రద్దు నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Uttar Pradesh CM Yogi Adityanath tweets, "UP Police constable civil police exams 2023 cancelled, orders given to re-conduct the exams within next 6 months…." pic.twitter.com/kI1BOjmKEx
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 24, 2024
#WATCH | Uttar Pradesh | Candidates in Lucknow celebrate as CM Yogi Adityanath announces cancellation of UP Police constable civil police exams 2023 and orders conducting of re-examination within next 6 months. pic.twitter.com/RCWJS8UBDd
— ANI (@ANI) February 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

