General Class Coaches | సాధారణ ప్రయాణికులకు ఊరట.. రైళ్లలో జనరల్ కోచ్‌లు నాలుగుకు పెంపు
General Class Coaches | సాధారణ ప్రయాణికులకు ఊరట కలగనున్నది. రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య నాలుగుకు పెరుగనున్నాయి. స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లలో విపరీతమైన రద్దీపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
న్యూఢిల్లీ: సాధారణ ప్రయాణికులకు ఊరట కలగనున్నది. రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య నాలుగుకు పెరుగనున్నాయి. స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లలో విపరీతమైన రద్దీపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైలు కోచ్‌ల వార్షిక ఉత్పత్తి కంటే అదనంగా 2500 జనరల్ క్లాస్ కోచ్‌లు తయారు చేయనున్నారు. దీంతో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేశారు.
కాగా, ప్రస్తుతం రెండు జనరల్ కోచ్‌లు ఉన్న రైళ్లలో వాటి సంఖ్య నాలుగుకు రెట్టింపు అవుతుందని సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. జనరల్ కోచ్‌లు లేని రైళ్లకు రెండు సమకూరుతాయని చెప్పారు. ఒక్కో జనరల్ కోచ్‌లో 150 నుంచి 200 మంది ప్రయాణించేలా తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రతి రోజూ అదనంగా ఐదు లక్షల మంది జనరల్ కోచ్‌లో ప్రయాణించ వచ్చని అన్నారు.
మరోవైపు జనరల్ కోచ్‌ల పెంపు ప్రణాళికతో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సామర్థ్యం పెరుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. దీని కోసం 1377 స్లీపర్ క్లాస్ కోచ్‌లతోపాటు అదనంగా 2500 జనరల్ కోచ్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దీంతో జనరల్ బోగిల్లో ఏటా 18 కోట్ల మంది ప్రయాణికులు ట్రావెల్ చేసేందుకు వీలు కలుగుతుందని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

