లక్నో: లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 13 మంది మరణించారు. (Poll Staff Dies) మరో 23 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. అధిక ఎండల కారణంగా తీవ్ర జ్వరం, హై బీపీ వంటి కారణాలతో 13 మంది పోలింగ్ సిబ్బంది చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ శనివారం జరిగింది. అయితే సోనభద్ర జిల్లాలో ఎన్నికల డ్యూటీలో పాల్గొన్న ఏడుగురు హోంగార్డు జవాన్లు, ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలో ఒక క్లర్క్, కన్సాలిడేషన్ ఆఫీసర్, ఒక ప్యూన్ మరణించారు. తీవ్ర జ్వరం, హై బీపీ వల్ల వారు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొన్న 23 మంది సిబ్బంది మిర్జాపూర్లోని ఆసుపత్రిలో చేరారు. ముగ్గురు వ్యక్తులు వడదెబ్బకు గురై మరణించగా, ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారని సీనియర్ అధికారి తెలిపారు. తీవ్ర ఎండలకు తాళలేక పలు ప్రాంతాల్లో కూడా ఎన్నికల విధుల్లో పాల్గొన్న పలువురు సిబ్బంది అనారోగ్యానికి గురయ్యారు.