US Immigration | వీసా వచ్చిందని అమెరికాకు ఎగిరిపోతే చాలదు.. రూల్స్ తెల్వకపోతే వచ్చిన ఫ్లైట్‌లో రిటర్న్ పంపించేస్తరు!!
US Immigration | విదేశాల్లో చదువులు, ఉద్యోగాల కోసం ఎన్నో కలలు కని, వాటిని సాకారం చేసుకొనేందుకు ఎంతో కష్టపడి తీరా అవకాశం లభించాక కొందరు చేజేతులా వాటిని కోల్పోతున్నారు.
US Immigration | విదేశీ చదువుల కోసం ఎన్నో కలలు.. వాటిని సాకారం చేసుకొనేందుకు ఎన్నో రోజుల కష్టం.. వీసా వచ్చిందని విదేశాల్లో వాలిపోయినా, అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు అడిగే ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పలేక ఎయిర్‌పోర్టు నుంచే స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్నారు. గత వారం అమెరికాలో ఈ పరిస్థితే ఎదురైంది. అయితే, ఫారిన్ చదువులకు వీసా ఒక్కటే ఎంట్రీకార్డు కాదని, ఇమ్మిగ్రేషన్ ఇంటర్వ్యూ కూడా గట్టెక్కాలని నిపుణులు సూచిస్తున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో చదువులు, ఉద్యోగాల కోసం ఎన్నో కలలు కని, వాటిని సాకారం చేసుకొనేందుకు ఎంతో కష్టపడి తీరా అవకాశం లభించాక కొందరు చేజేతులా వాటిని కోల్పోతున్నారు. గత వారం అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు చిన్నచిన్న పొరపాట్ల కారణంగా, అవగాహన లేమితో తిరిగి స్వదేశం పయనమయ్యారు. వివిధ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు లభించి వాటిలో చేరేందుకు శాన్ఫ్రాన్సిస్కో, షికాగో, అట్లాంటా విమానాశ్రయాల్లో వారిని రిటర్న్ ఫ్లయిట్లు ఎక్కించారు. వీరిలో ఎక్కువమంది తెలుగువారు ఉన్నట్టు తెలుస్తున్నది. సరైన పత్రాలు లేకపోవడం వల్లనే వారిని తిప్పి పంపుతున్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్తున్నప్పటికీ కారణాలు వేరుగా ఉన్నట్టు సమాచారం. ఢిల్లీకి శుక్రవారం సాయంత్రం చేరుకోనున్న విద్యార్థులు అక్కడి నుంచి రైళ్ల ద్వారా స్వస్థలాలకు పయనం కానున్నారు.
ఓపికగా జవాబు చెప్పాలి
సాధారణంగా అమెరికాలో ప్రవేశించాక అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు విద్యార్థులను పేరు, తలిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, ఏ వర్సిటీలో ఏ కోర్సు చదవబోతున్నారు వంటివి.. ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వనరులు, బ్యాంక్ స్టేట్మెంట్స్ వంటి వాటిపైనా ప్రశ్నలేసి ఆరా తీస్తారు. వాటికి ఓపికగా సమాధానాలు చెప్పాలి. ఈ ప్రశ్నలకు సమాధానాలివ్వని కారణంగానే విద్యార్థులను వెనక్కిపంపినట్లుగా తెలుస్తున్నది. విద్యార్థులను గంటల తరబడి కూర్చుండబెట్టి అడిగినా వారి నుంచి సమాధానాలు రాకపోవడంతోనే వారిని తిప్పి పంపినట్టు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా వెళ్లే విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని కన్సల్టెన్సీ నిర్వాహకుడు సాయి వేదశ్యామ్ సూచించారు.
వెనక్కి రావడానికి కారణాలివే..
- ఓ విద్యార్థినిని.. మీరు చదివే కాలేజీలో ఫీజు రూ. 30 లక్షలవుతుంది. అంత మొత్తాన్ని ఎలా సంపాదిస్తారని అడిగితే.. ఆమె పార్ట్‌టైమ్ జాబ్చేసి సంపాదిస్తానని చెప్పడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. అమెరికా నిబంధనల ప్రకారం పార్ట్‌టైం జాబ్స్‌ను అనుమతించరు. కేవలం పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు మాత్రమే ఇస్తారు. ఈ సమయంలో మాత్రమే పనిచేసి సంపాదించుకోవాలి.
- మరో విద్యార్థిని ఫైనాన్షియల్ ఫ్రూఫ్స్, ఆథరైజేషన్ లెటర్లు, లోన్ డాక్యుమెంట్లు అడుగగా.. తన వద్దలేవని చెప్పడంతో వెనక్కి పంపించారు. బ్యాంక్ నిల్వను చూపించని వారికి ఇదే పరిస్థితి తలెత్తింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

