Watch: అంబులెన్స్‌ను ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్‌లోని వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Minister's Convoy Hits Ambulance | మంత్రి ప్రయాణించిన కాన్వాయ్‌లోని వాహనం అంబులెన్స్‌ను (Minister's Convoy Hits Ambulance) ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఆపై గిరగిరా తిరిగి ట్రాఫిక్ పోలీస్ వైపు దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తు ఆ ట్రాఫిక్ పోలీస్ రెండుసార్లు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
తిరువనంతపురం: మంత్రి ప్రయాణించిన కాన్వాయ్‌లోని వాహనం అంబులెన్స్‌ను (Minister’s Convoy Hits Ambulance) ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఆపై గిరగిరా తిరిగి ట్రాఫిక్ పోలీస్ వైపు దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తు ఆ ట్రాఫిక్ పోలీస్ రెండుసార్లు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలో ఈ సంఘటన జరిగింది. కేరళ విద్యాశాఖ మంత్రి వీ శివన్కుట్టి బుధవారం తన కాన్వాయ్‌లో ప్రయాణించారు. అయితే నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద రాంగ్ రూట్లో టర్న్ తీసుకునేందుకు ఆయన కాన్వాయ్ ప్రయత్నించింది. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అంతలోనే కొన్ని వాహనాలు వేగంగా రోడ్డును క్రాస్ చేశాయి.
కాగా, కేరళ మంత్రి శివన్‌కుట్టికి ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసులతో కూడిన పైలట్ కారు రోడ్డును క్రాస్ చేయబోయింది. ఇంతలో ఒక అంబులెన్స్ వేగంగా ఆ వాహనం ముందు నుంచి దూసుకెళ్లింది. దీంతో పైలట్ వాహనం ఆ అంబులెన్స్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో అంబులెన్స్ రోడ్డుపై బోల్తా పడింది. పక్కవైపులకు దొర్లింది. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్‌ను రెండు సార్లు ఢీకొట్టబోయింది. అయితే ఆయన క్షణాల్లో స్పందించారు. మీదకు దూసుకొస్తున్న అంబులెన్స్ నుంచి రెండు సార్లు తప్పించుకున్నారు.
మరోవైపు అంబులెన్స్‌ను ఢీకొన్న పైలట్ వాహనం, క్రాస్ రోడ్డు వద్ద నిలిచి ఉన్న బైక్ వైపు దూసుకెళ్లి ఆగింది. దీంతో ఆ బైక్‌పై ఉన్న ఇద్దరు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా, మంత్రి కాన్వాయ్ వాహనం మాత్రం అక్కడ ఆగకుండా వెళ్లిపోయింది. షాక్ నుంచి తేరుకున్న ట్రాఫిక్ పోలీస్, రోడ్డుపై ఉన్న వారు బోల్తా పడిన అంబులెన్స్‌లో ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అందులో ఉన్న రోగి, మరో ఇద్దరు గాయపడ్డారు.
కాగా, ఈ సంఘటనకు సంబంధించి పైలట్ వాహనం డ్రైవర్‌తోపాటు, అంబులెన్స్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోవైపు కేరళ మంత్రి శివన్కుట్టి ఈ సంఘటనపై ఇప్పటి వరకు స్పందించలేదు.
The convoy of Kerala Education Minister V. Sivankutty hit an ambulance and bike, but a case has been registered against the ambulance driver as well.
VIP culture and a sense of Entitlement aren't going anywhere. That's lip-service. pic.twitter.com/NYLjhiRjMI
— BALA (@erbmjha) July 14, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

