న్యూఢిల్లీ: అమెజాన్ వ్యాపారం రోజురోజుకు వృద్ధి సాధిస్తున్నదని, వచ్చే ఏడాది ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని అమెజాన్ తెలిపింది. ఈ సంస్థకు చెందిన క్లౌడ్ యూనిట్లో ఉద్యోగాల అవసరం ఉన్నదని, అందుకే నియామకాలు చేపట్టాలనుకుంటున్నామని వెల్లడించింది.
‘డాటాను భద్రపర్చడంలో క్లౌడ్ యూనిట్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ రంగం రోజురోజుకు విస్తరిస్తున్నది. డిమాండ్ పెరుగుతున్నది. కాబట్టి మరిన్ని డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం’ అని వెల్లడించింది.