న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో రికార్డును సొంతం చేసుకున్నది. కంపెనీ సెల్లర్ సంఖ్య 20 లక్షల మార్క్‌ను అధిగమించిందని తాజాగా ప్రకటించింది. మూడేండ్లలో అత్యధిక వార్షిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న సంస్థ..కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి సెల్లర్లపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపింది.
వెయ్యి రూపాయల లోప ధర కలిగిన ఉత్పత్తులకు సున్నా రెఫరల్ ఫీజును ప్రవేశపెట్టడం, విక్రయ భాగస్వాములు ఏఐ సాధానాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ పెరుగుదల నమోదైందని పేర్కొంది. ప్రస్తుత పండుగ సీజన్లో 1.6 లక్షల మంది సీజనల్ వర్కర్లకు ఉపాధి అవకాశాలు అందించనున్నట్టు ఇది వరకే ప్రకటించిన సంస్థ..అందుకు తగ్గట్టుగా సెల్లర్లను పెంచుకుంటున్నది.