న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జూలై 20న విద్యార్థులు నిర్వహించిన ఛలో సంసద్‌లో పోలీసులు పెల్లెట్‌గన్స్ వాడారంటూ అనేక ఆధారాలు బయటకొస్తున్నాయి. ఢిల్లీకి చెందిన 28 ఏండ్ల యువకుడిపై పోలీసులు పెల్లెట్గన్స్తో దాడి చేయగా.. అతని మోచేతికి, వీపుకు గాయాలయ్యాయి.
అతనికి చికిత్స అందించిన సఫ్దర్‌గంజ్ దవాఖానలో ఇచ్చిన కేస్‌షీట్‌లో కూడా ఇదే బయటపడింది. నిరసనల్లో పాల్గొన్న 19 ఏండ్ల సాహిల్ కూడా తనపై పెల్లెట్గన్స్తో దాడి జరిగినట్టు ఆరోపించాడు. సాహిల్ కుడికన్నుపై పెల్లెట్ గన్స్ దాడి జరగడంతో ఆ కన్నుతో ఏమీ చూడలేకపోతున్నాడని మేనమామ అజయ్ దుగ్గల్ చెప్పారు.