బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 07, 2020 , 14:15:06

ఢిల్లీలో రాత్రి 10 వ‌ర‌కు మ‌ద్యం!

ఢిల్లీలో రాత్రి 10 వ‌ర‌కు మ‌ద్యం!

న్యూఢిల్లీ: మ‌ద్యం అమ్మ‌కాల‌ను మ‌రింత పెంచేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ రోజు నుంచి ఢిల్లీలోని అన్ని మ‌ద్యం దుక‌ణాలు ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంచేందుకు అవ‌కాశం ఇచ్చింది. తాము త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు మ‌ద్యం దుకాణాల‌కు ఇవే వేళ‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టంచేసింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే ఢిల్లీలో సైతం గ‌త మార్చి నుంచి మ‌ద్యం దుకాణాలు మూత‌ప‌డ్డాయి. 

అయితే, ఆ త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన స‌డ‌లింపుల మేర‌కు మే నెల‌లో మ‌ద్యం షాపులు పునఃప్రారంభ‌మ‌య్యాయి. ముందుగా సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే మ‌ద్యం అమ్మ‌కాల‌కు అనుమ‌తించిన ఢిల్లీ ప్ర‌భుత్వం.. క్ర‌మంగా ఆ స‌మ‌యాన్ని పెంచుతూ ఇప్పుడు రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు తీసుకొచ్చింది.    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo