Karwa Chauth | భర్త, కుటుంబ శ్రేయస్సు కోరుతూ.. కర్వా చౌత్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Karwa Chauth | పండగ ఏదైనా.. మన సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తాయి. ఇంటిల్లిపాదీ, బంధువులతో కలిసి జరుపుకునే పండుగలు కొన్నైతే, ఆడవారు మాత్రమే జరుపుకే పండుగలు మరికొన్ని.
Karwa Chauth | పండగ ఏదైనా.. మన సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తాయి. ఇంటిల్లిపాదీ, బంధువులతో కలిసి జరుపుకునే పండుగలు కొన్నైతే, ఆడవారు మాత్రమే జరుపుకే పండుగలు మరికొన్ని. వాటిల్లో శ్రావణమాసం, కార్తీకమాసాలతోపాటు కర్వా చౌత్ (Karwa Chauth) కూడా ఒకటి. కార్తీకం, శ్రావణ మాసాల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేసుకుంటుంటారు. ఆయా మాసాల్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు, ఉపవాస దీక్షలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కర్వా చౌత్ కూడా అంతే.. పార్వతీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజించి, నిష్టతో ఉపవాసం చేస్తారు. ఉత్తరాది మహిళలు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరో రెండు రోజుల్లో కర్వాచౌత్ వస్తున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..
కర్వా చౌత్.. ఈ పండుగను ఉత్తర భారతీయులు (North India) ఎక్కువగా జరుపుకుంటుంటారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కర్వా చౌత్ ఉపవాసం సాంప్రదాయకరంగా జరుపుకుంటారు. పౌర్ణమి తర్వాత నాలుగో రోజు ఈ పండుగ వస్తుంది. ఆరోజున జీవిత భాగస్వామి, కుటుంబ క్షేమాన్ని కోరుతూ మహిళలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఉపవాసం ఉంటారు. అమ్మవారికి నిష్టగా పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం చంద్రుడి దర్శనం చేసుకుంటారు.
జల్లెడలో ముందుగా చంద్రుడిని చూసి ఆ తర్వాత భర్త ముఖాన్ని చూస్తారు. భర్త ఆశీర్వాదాల అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. పెళ్లికాని యువతులు కూడా ఉపవాస దీక్ష చేస్తారు. మంచి భర్త రావాలని కోరుకుంటూ పార్వతీ దేవిని పూజిస్తారు. అనంతరం కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విందులో పాల్గొంటారు.
విభిన్న నేపథ్యాలు..
ఇక ఈ పండుగకు విభిన్న నేపథ్యాలు ఉన్నాయి. అప్పట్లో రాజ్పుత్ పురుషులు తమ భార్య, పిల్లల్ని వదిలేసి తరచూ యుద్ధానికి వెళ్లేవారు. దీంతో తమ భర్తలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ మహిళలు భక్తితో ఉపవాస దీక్ష చేసేవారు. వారికోసం ప్రత్యేకమైన వంటకాలు సిద్ధం చేసి.. సాయంత్రం భర్త కోసం వేచి చూస్తుండేవారు. అప్పటి నుంచే ఈ కర్వాచౌత్ పండుగ ప్రాశస్త్యం పొందిందని చెబుతుంటారు.
వాయువ్య ప్రాంతంలో ఈ పండుగను మరో విధంగా చేసుకుంటారు. శరదృతువులో పంట చేతికి రాగానే ఈ పండుగను జరుపుకుంటారు. గోధుమలను నిల్వ ఉంచే పెద్ద మట్టి కుండలను ‘కర్వాస్’ అని పిలుస్తారు. ఆ రోజున పెద్ద పెద్ద మట్టి కుండల్లో గోధుమలను నింపి శివపార్వతులకు సమర్పిస్తారు. అదేవిధంగా మహిళలు తమ బంధువుల్ని, స్నేహితుల్ని కలిసి బహుతులు ఇచ్చిపుచ్చుకుంటుంటారు.
ఎరుపు, నారింజ దుస్తుల్లో..
ఇక కర్వా చౌత్ రోజున మహిళలు పెళ్లి కూతుళ్లలా ముస్తాబవుతారు. కొందరు పెళ్లి నాటి దుస్తులు, నగలు ధరిస్తే.. మరికొందరులెహంగా, చీర వంటి కొత్త బట్టలతో సంప్రదాయబద్ధంగా రెడీ అవుతారు. ఆ రోజున ఎక్కువగా ఎరుపు, నారింజ రంగు దుస్తులనే ధరిస్తారు. చేతి నిండా గాజులు, నుదుటన కుంకుమతో అందంగా ముస్తాబై అమ్మవారిని కొలుస్తారు. కర్వా చౌత్ పండుగ భార్యా భర్తల మధ్య బంధాన్ని దృఢం చేస్తుందని నమ్ముతారు.
కోడలి కోసం అత్తగారి ప్రత్యేక వంటకం..
కర్వా చౌత్ రోజున అత్తగారు కోడలికి ప్రత్యేక వంటకం తయారు చేస్తారు. దాన్ని సంప్రదాయ ‘సర్గి’ (థాలి) అంటారు. ఉపవాసం ఉండే కోడలికి అత్తగారు ‘సర్గి’ని చేసి అందించడం ఆనవాయితీ. మన దగ్గర అట్లతద్దిలో మాదిరిగానే కర్వాచౌత్ రోజున ఉపవాస దీక్ష తీసుకోబోయే కొన్ని గంటల ముందు ‘సర్గి’ని ఆహారంగా తీసుకుంటారు. ఈ థాలిలో స్వీట్లు, పండ్లు, పాలు, పెరుగు, డ్రైఫ్రూట్స్ వంటి ప్రత్యేక పదార్థాలు ఉంటాయి. అత్తగారి ఆశీర్వాదంతో కోడళ్లు సూర్యోదయానికి ముందే దీన్ని తీసుకుంటారు.
Also Read..
Harish Rao | బతుకమ్మ చీరలపై మంత్రి సీతక్క పొంతన లేని వ్యాఖ్యలపై హరీశ్రావు ఫైర్
Stock Market Close | స్టాక్ మార్కెట్లు డౌన్.. వరుసగా మూడోరోజు..!
Military Officers couple suicide | ఐఏఎఫ్, ఆర్మీ అధికారులైన దంపతులు.. వేర్వేరు చోట్ల ఆత్మహత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

