Military Officers couple suicide | ఐఏఎఫ్, ఆర్మీ అధికారులైన దంపతులు.. వేర్వేరు చోట్ల ఆత్మహత్య
Military Officers couple suicide | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్), ఆర్మీ అధికారులైన భార్యాభర్తలు ఒకే రోజున వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భర్తతోపాటు తన మృతదేహానికి కలిసి అంత్యక్రియలు నిర్వహించాలని ఆర్మీ అధికారిణి అయిన భార్య సూసైడ్ నోట్లో పేర్కొంది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఆత్మహత్యకు పాల్పడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్), ఆర్మీ అధికారులైన భార్యాభర్తలు ఒకే రోజున వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. (Military Officers couple suicide) తన భర్తతోపాటు తన మృతదేహానికి కలిసి అంత్యక్రియలు నిర్వహించాలని ఆర్మీ అధికారిణి అయిన భార్య సూసైడ్ నోట్లో పేర్కొంది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఆత్మహత్యకు పాల్పడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీహార్‌లోని నలంద జిల్లాకు చెందిన 32 ఏళ్ల దీన్ దయాళ్ దీప్, ఐఏఎఫ్‌లో ఫ్లైట్ లెఫ్టినెంట్. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఖేరియా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. రాజస్థాన్‌కు చెందిన ఆర్మీ కెప్టెన్ రేణు తన్వర్ ఆగ్రాలోని మిలిటరీ హాస్పిటల్లో పనిచేస్తున్నది. మిలిటరీకి చెందిన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆగ్రా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ క్వాటర్స్‌లో భార్యాభర్తలు నివసిస్తున్నారు.
కాగా, అక్టోబర్14న సోమవారం రాత్రి సహోద్యోగులతో కలిసి డిన్నర్ చేసిన ఫ్లైట్ లెఫ్టినెంట్ దీన్ దయాళ్ దీప్ తన క్వాటర్స్‌కు వెళ్లి నిద్రించాడు. మరునాడు ఉదయం అతడు నిద్ర నుంచి లేవకపోవడంతో ఎయిర్‌ఫోర్స్ అధికారులు తలుపు పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. అతడు సూసైడ్ చేసుకున్నట్లు గమనించి ఆగ్రా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడి నివాసంలో అలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
మరోవైపు దీన్ దయాళ్ దీప్ భార్య అయిన ఆర్మీ కెప్టెన్ రేణు తన్వర్, తన తల్లి కౌశల్యకు వైద్య చికిత్స కోసం సోదరుడు సుమిత్తో కలిసి అక్టోబర్ 14న ఢిల్లీ చేరుకున్నది. ఆర్మీ కంటోన్మెంట్ గెస్ట్ హౌస్‌లో వారు బస చేశారు. తల్లి, సోదరుడు ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లగా కంటోన్మెంట్ గెస్ట్ హౌస్‌లో ఒంటరిగా ఉన్న రేణు తన్వర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, తన మృతదేహాలకు కలిసి అంత్యక్రియలు నిర్వహించాలని సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారులు ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మిలిటరీలో అధికారులైన భార్యాభర్తలు ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడటంపై ఢిల్లీ, ఆగ్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Agra
- army officer
- Couple
- Delhi
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

