Sama Parveen | అల్‌ఖైదా సూత్రధారి షామా పర్వీన్ అరెస్ట్
Sama Parveen | అల్‌ఖైదా సూత్రధారి షామా పర్వీన్(30) అరెస్టు అయ్యారు. షామా పర్వీన్‌ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Sama Parveen | బెంగళూరు : అల్‌ఖైదా సూత్రధారి షామా పర్వీన్(30) అరెస్టు అయ్యారు. షామా పర్వీన్‌ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 22న నలుగురు అల్‌ఖైదా సభ్యులను అరెస్టు చేయడంతో.. షామా పర్వీన్ పేరు వెలుగులోకి వచ్చింది. విచారణలో తమ నాయకురాలు పర్వీన్ అని ఉగ్రవాదులు చెప్పారు. రహస్య, ఆటో డిలీటెడ్ యాప్ ద్వారా సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు. సోషల్ మీడియా గ్రూపులో అన్ని రాష్ట్రాల సభ్యులు ఉన్నట్లు తేలింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు కుట్ర చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
అయితే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహించడంతో పాటు ఉగ్ర దాడులకు కుట్ర చేస్తున్నట్లు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ డిప్యూటీ సూపరింటెండెంట్ హర్ష ఉపాధ్యాయకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. అనేక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద చర్యలను ప్రేరేపిస్తున్నట్లు నిఘా వర్గాలు తేల్చాయి. ముస్లిం యువతను రెచ్చగొడుతూ.. దేశానికి వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించడానికి ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను వినియోగిస్తున్నట్లు తేలింది.
ఈ క్రమంలో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎస్పీ సిద్ధార్థ్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ బృందం.. ఆయా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అల్‌ఖైదా ఉగ్రవాదులను గుర్తించింది. ఈ నెల 22న ఫర్దీన్ షేక్(అహ్మదాబాద్), సైఫుల్లా ఖురేషి(గుజరాత్), మహమ్మద్ ఫాయిక్(ఢిల్లీ), జీషన్ అలీ(ఉత్తరప్రదేశ్) ని అరెస్టు చేశారు. వీరిని విచారిస్తున్న క్రమంలో తమ నాయకురాలు షామా పర్వీన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ గ్రూపులోని ఇతర సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

