బాబాయ్ శివపాల్ యాదవ్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సలహా ఇచ్చారు. ఆయన ప్రగతిశీల సమాజ్‌వాదీకి అధ్యక్షుడని, తన పార్టీని బలోపేతం చేసుకోవడంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆ పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడని, పార్టీ బలోపేతం దృష్టి పెట్టాలని అన్నారు. శివపాల్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో అఖిలేశ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఝాన్సీ నియోజకవర్గంలో అఖిలేశ్ గురువారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయనకు ఓ పార్టీ వుందని, దానికి ఆయన జాతీయ అధ్యక్షుడని చెప్పుకొచ్చారు. తమ పార్టీ ఆయనకు కేవలం సింబల్ మాత్రమే ఇచ్చిందని, ఎవరికైనా సింబల్ ఇస్తే, ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగాలన్నారు.
శివపాల్ యాదవ్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు తెగ ప్రచారంలో వున్నాయి. అంతేకాకుండా సమాజ్‌వాదీ సీనియర్ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌తో కలిసి ఓ కొత్త పార్టీనే స్థాపించనున్నారన్న వార్తలు కూడా వున్నాయి. ఈ నేపథ్యంలోనే అఖిలేశ్ ఈ సూచనలు చేశారు. బీజేపీతో అంటకాగే వారు తమ పార్టీలో అవసరం లేదని అఖిలేశ్ తెగేసి చెప్పారు. దీంతో ఆయన ఆజంఖాన్ వైపు చూస్తున్నట్లు సమాచారం.