లక్నో :యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే చుట్టూ రాజకీయం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఈ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించనుండగా ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రాజెక్టును హడావిడిగా నాసిరకంగా పూర్తిచేయడంలో బీజేపీ ప్రభుత్వం నాణ్యత విషయంలో రాజీపడిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనాలను ఆశించిన బీజేపీ అరకొరగా పూర్తయిన పూర్వంచల్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభిస్తోందని మండగిపడ్డారు. పూర్తి నాణ్యతతో చేపట్టాల్సిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును బీజేపీ నాసిరకంగా నిర్మించిందని అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు.