ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, తన కుమారుడు మళ్లీ కలవాలని దేవుడ్ని ప్రార్థించినట్లు తెలిపారు. తన ప్రార్థనలు ఫలిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొత్త ఏడాది తొలి రోజైన బుధవారం అజిత్ పవార్ తల్లి ఆశా-తాయ్ పవార్, పంఢర్‌పూర్‌లోని ప్రసిద్ధ విఠల్, రుక్మిణీ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు, విడిపోయిన శరద్ పవార్ మధ్య మళ్లీ సయోధ్య కుదరాలని విఠల్ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ‘పవార్ కుటుంబంలో ఉన్న మనస్తాపాలన్నీ తొలగిపోవాలని నేను ప్రార్థించా. అజిత్, శరద్ పవార్ మళ్లీ కలవాలని నేను ప్రార్థించా. నా ప్రార్థనలు ఫలిస్తాయని ఆశిస్తున్నా’ అని అన్నారు.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ప్రత్యర్థి శరద్ పవార్ వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శరద్ పవార్‌తో తన కుమారుడు మళ్లీ కలవాలని అజిత్ పవార్ తల్లి ఆశా-తాయ్ పవార్ బహిరంగంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఎన్సీపీలో కీలక నేత ప్రఫుల్ పటేల్ కూడా దీనిపై స్పందించారు. ‘శరద్ పవార్ మాకు దేవుడు లాంటివారు. పవార్ కుటుంబం ఏకమైతే నేను చాలా సంతోషిస్తా’ అని మీడియాతో అన్నారు.
VIDEO | Maharashtra Deputy CM Ajit Pawar’s mother interacts with media as she visits Shri Vitthal Rukmini Temple in Pandharpur to offer prayers.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/JLXF5mfR5L
— Press Trust of India (@PTI_News) January 2, 2025