Pawar vs Pawar | బాబాయ్‌పై అబ్బాయ్దే పైచేయి.. మహా రాజకీయాల్లో శరద్ పవార్ శకం ముగిసినట్లేనా?
రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ప్రభ మహారాష్ట్రలో క్రమంగా మసకబారుతున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన ఆయన ఎన్సీపీని స్థాపించి రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అయితే ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ గతేడాది పార్టీని చీల్చి బీజేపీ పక్షాన చేరారు.
ముంబై: రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ప్రభ మహారాష్ట్రలో క్రమంగా మసకబారుతున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన ఆయన ఎన్సీపీని స్థాపించి రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అయితే ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ గతేడాది పార్టీని చీల్చి బీజేపీ పక్షాన చేరారు. దీంతో తాను ప్రారంభించిన పార్టీ తనకు కాకుండా పోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తన మార్కు రాజకీయాలు నడిపించాలని చూసిన ఆయనకును మరాఠా ప్రజలు పట్టించుకోలేదు. ఎంవీయే కూటమిలో భాగంగా 86 స్థానాల్లో పోటీచేసిన శరద్ పవార్ ఎన్సీపీ వర్గం కేవలం 13 సీట్లకు పరిమితమైంది.
ఇక ఎన్టీయే కూటమిలో ఉన్న అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో బరిలో నిలిచి 37 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది. బారామతి నుంచి పోటీచేసిన అజిత్ తన సోదరుని కుమారుడు, ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి యుగేంద్ర పవార్‌పై ఘన విజయం సాధించారు. దీంతో బాబాయ్‌పై తనదే పైచేయి అని మరోసారి నిరూపించుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న శరద్ పవార్.. ఇకపై మరాఠా ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపుతారనే విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, అజిత్‌ను తట్టుకుని ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే పార్టీని నిలబెట్టగలుగుతారా అని సర్వత్రా చర్చ సాగుతున్నది.
ఇక, అధికారం కోసం శివసేన, ఎన్సీపీలను చీల్చిన బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అంతా అనుకున్నప్పటికీ.. అది కార్యరూపం దాల్చేదు. మరోసారి ఎన్డీయే కూటమికే మరాఠీలు పట్టం కట్టారు. 220 స్థానాలతో తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. దీంతో బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నది. బీజేపీకి 126 స్థానాలు రాగా, శివసేన (శిండే)కు 55, ఎన్సీపీకి 38 సీట్లు వచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

