జమ్ము కశ్మీర్‌లోని రియాసీలో యాత్రికులే లక్ష్యంగా బస్‌పై దాడి చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో బస్ డ్రైవర్ సహా 9 మంది యాత్రికులు మరణించడంతో పాటు 33 మంది మరణించారు.
జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం ఉగ్రవాదం సమసిపోయిందని, అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొందని బీజేపీ నేతలు చెప్పుకున్నారని ఇదంతా ప్రచార ఆర్భాటం మినహా మరొకటి రాదని రాయ్ అన్నారు. కశ్మీర్లో తాజా ఉగ్రదాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఇక లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు కేవలం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమే తమ నియోజకవర్గాలను సందర్శించారని అజయ్ రాయ్ పేర్కొన్నారు.
Read More :
Health tips | ఆ అలవాట్లు ఆరోగ్యానికి హానికరం.. మానేస్తేనే మనుగడ