కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వెట్రి మారన్ డైరక్షన్ లో విజయ్ సేతుపతి నటిస్తోన్న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. విదుతలై పేరుతో రాబోతున్న ఈసినిమాలో విలన్ గా నటిస్తోంది ఎవరో తెలుసా సూరి.
తమిళంలో పలు సినిమాల్లో కమెడియన్ గా నటించిన సూరి విదుతలై సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నాడు. ఇళయరాజా సంగీతం అందిస్తోన్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.