టొరంటో, ఆగస్టు 16: ఎయిర్ కెనడాకు చెందిన 10,000 మందికిపైగా ఫ్లెట్ అటెండెంట్లు సమ్మెకు దిగడంతో విమానయాన సంస్థ తన విమాన సర్వీసులన్నిటినీ రద్దు చేసింది. దీంతో వేలాదిమంది పర్యాటకులు తీవ్ర అవస్థలనెదుర్కొంటున్నారు. ఎయిర్లైన్స్ యాజమాన్యానికి, కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘానికి మధ్య చర్చలు విఫలం కావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి ఎయిర్ కెనడా ఫ్లైట్ అటెండెంట్లు సమ్మె చేపట్టారు. కెనడాలో ప్రధాన విమానయాన సంస్థగా పేరొందిన ఎయిర్ కెనడా తన 700 విమాన సర్వీసులను తక్షణమే రద్దు చేసింది.