న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ శుక్రవారం 21వ పశు గణనను ప్రారంభించారు. మహమ్మారి వచ్చినపుడు పశువుల ఆరోగ్య భద్రతకు తగిన ఏర్పాట్లు చేయడం కోసం పాండెమిక్ ఫండ్ ప్రాజెక్టును కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పశు గణన కార్యక్రమంలో 16 జాతులకు చెందిన 219 దేశవాళీ పశు, పక్షుల సమాచారాన్ని సేకరిస్తామన్నారు. పశువుల ఆరోగ్య భద్రత, పశు సంవర్ధక విధానాలను సరైన రీతిలో రూపొందించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందన్నారు.
ఎల్ఏసీ ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలు వెనక్కి
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు స్వస్తి పలికి శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి భారత్, చైనా తొలి అడుగు వేశాయి. రెండు ప్రధాన ఘర్షణ ప్రాంతాలైన డెమ్చోక్, దెప్సాంగ్ నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఈ నెల 28-29 తేదీల్లోగా ఇది పూర్తవుతుందని అంచనా. ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను తొలగించి శాంతియుత వాతావరణం ఏర్పరుచుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి.