నాగపట్టణం: తమిళనాడులో ఏప్రిల్ ఆరవ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆయా రాజకీయ పార్టీలు ప్రచార హోరు పెంచేశాయి. ఇక అన్నాడీంఎకే అభ్యర్థి తంగ కత్తిరావన్ ఏకంగా ఓ ఓటరు ఇంటికి వెళ్లి బట్టలు ఉతికారు. ప్రచారంలో భాగంగా ఆయన నాగపట్టణంలో తిరిగారు. బట్టలు ఉతికిన ఆ ఎమ్మెల్యే అభ్యర్థి.. స్థానిక ఓటర్లకు హామీ కూడా ఇచ్చారు. తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే.. వాషింగ్ మెషీన్లు ఇస్తామని చెప్పారు. సోమవారం ప్రచార సమయంలో ఈ ఘటన జరిగింది. అన్నాడీఎంకే పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో .. వాషింగ్ మెషీన్లు ఇచ్చేందుకు వాగ్ధానం చేసింది.
Tamil Nadu: AIADMK candidate Thanga Kathiravan from Nagapattinam washed clothes and promised to give washing machine after winning elections during campaigning yesterday. pic.twitter.com/orDGoRFUhn
— ANI (@ANI) March 23, 2021