దావోస్, జనవరి 21: కార్మిక మార్కెట్‌ను సునామీ తాకుతున్నది.. ఉద్యోగాలు కృత్రిమ మేధస్సుతో భర్తీ అవుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా హెచ్చరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆమె మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏఐ రాకను అనుభవిస్తున్నదని, అయితే కొన్ని చోట్ల ఇతర ప్రదేశాల కంటే ఉన్న ఎక్కువ అవకాశాల తేడాల గురించి తాను ఆందోళన చెందుతున్నానని ఆమె అన్నారు. ‘ఏఐ ఆర్థిక వ్యవస్థలను రూపు త్వరితంగా మారుస్తుంది. కొన్ని అభివృద్ధి చెందుతాయి. కొన్ని అదృశ్యమవుతాయి.’ అని ఆమె పేర్కొన్నారు.