న్యూఢిల్లీ, అక్టోబర్ 26: టెక్స్, ఆడియో ప్రాంప్ట్‌ల నుంచి సంగీతాన్ని సృష్టించ గల కొత్త జనరేటివ్ మ్యూజిక్ టూల్‌పై ఓపెన్ ఏఐ కసరత్తు చేస్తున్నది. ఈ వినూత్న సాధనం వీడియోలకు సౌండ్ ట్రాక్‌లు, లేదా వాద్య అనుబంధాలను జోడించడానికి అనుమతినిస్తుందని ‘ద ఇన్ఫర్మేషన్’ వెల్లడించింది. అయితే ఇది ఎప్పుడు విడుదల చేస్తారు? అన్నది వెల్లడించలేదు. అలాగే దీన్ని చాట్‌జీపీటీ, వీడియో జనరేటర్ సోరా లాంటి వేదికలతో ఇంటిగ్రేట్ చేస్తారా లేక ప్రత్యేకంగా దీనిని విడుదల చేస్తారా అన్నది కూడా తెలుపలేదు.