Stargate | న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ (చాట్ జీపీటీ సృష్టికర్త) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో భారీ ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాయి. ఏఐ టెక్నాలజీ వాస్తవిక సామర్థాన్ని అందిపుచ్చుకునేందుకు ‘స్టార్గేట్’ పేరుతో సూపర్ కంప్యూటర్ను తయారు చేయనున్నట్టు ప్రకటించాయి. 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.34 లక్షల కోట్ల) అంచనా వ్యయంతో ఏఐ సూపర్ కంప్యూటర్ను 2028లో ఆవిష్కరించనున్నట్టు తెలుస్తున్నది.