న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Modi-Putin).. శుక్రవారం ఢిల్లీలో ద్వైపాక్షిక భేటీలో పాల్గొనున్నారు. వాణిజ్యం, ఆర్థిక సహకారంపై చర్చించనున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ ఇండియా వస్తున్నారు. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఢిల్లీలో ఆ సదస్సు జరగనున్నది. ద్వైపాక్షిక సంబంధాలపై పుతిన్, మోదీ భేటీలో చర్చించనున్నట్లు దిమిత్రి తెలిపారు. బ్రిక్స్ సమ్మిట్‌ను హోస్ట్ చేస్తున్న ఇండియా దాంట్లో సక్సెస్ కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని దేశాల తమ కరెన్సీతో భారత్‌పై వత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఆర్థిక రంగం గురించి కూడా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. సుఖోయ్-57 ఫిప్త్ జనరేషన్ యుద్ధ విమానాలు, అణ్వస్త్ర విద్యుత్తు కేంద్రాలు, అమెరికా ఆంక్షల గురించి కూడా ఇరువురు నేతలు చర్చించనున్నారు.