Hasnuram Ambedkari | ఆగ్రా: ఆయన పేరు హస్నూరామ్ అంబేద్కరీ. వయస్సు 78 ఏండ్లు. ఇప్పటి దా కా 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. తాజాగా మరోసారి రెండు స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యాడు. యూపీలోని ఆగ్రా జిల్లా ఖేరాఘర్కు చెందిన ఈయన ఎన్నికల్లో పోటీ చేయడంలో సెంచరీ కొట్టాకే అస్త్ర సన్యాసం చేస్తానని ప్రకటించాడు.
అంబేద్కరీ 19 85లో మొదటి సారి స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేశారు. గ్రామ పంచాయతీ, రాష్ట్ర అసెంబ్లీ, ఎమ్మెల్సీ, ఎంపీ ఇలా ప్రతి ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటిసారి తనకు బీఎస్పీ టికెట్ ఇస్తానని చెప్పి నిరాకరించిందని.. కారణమడిగితే.. ‘నీ భార్య ఓటే నీకు పడదు.. అ లాంటిది ఇతరులెలా వేస్తార’ని అవమానించారని చెప్పాడు. అందుకే అప్పటి నుంచి పోటీ చేస్తున్నట్టు చెపారు.