న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్షను భారత్ శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసింది. మధ్యస్థ రేంజ్ క్షిపణి అయిన అగ్ని-4ను ఒడిశాలోని చాందీపూర్నుంచి ప్రయోగించినట్టు అధికారులు తెలిపారు.భారత న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో భాగమైన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ దీనిని నిర్వహించిందన్నారు. అగ్ని-4తో లక్ష్య పరిధి మరింత పెరిగింది. 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది. 20 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి వెయ్యి కేజీల పేలోడ్‌ను మోసుకుపోగలదు.