న్యూఢిల్లీ : అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా అగ్గి రాజుకుంటే మరోవైపు త్రివిధ దళాల్లో అగ్నివీరుల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం సోమవారం షెడ్యూల్ విడుదల అయింది. అగ్నివీరుల పధకంలో చేరే యువతకు భారత సైన్యంతో పాటు, నావికాదళం, వాయుసేనల్లో అవకాశం కల్పిస్తారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం అగ్నివీరులుగా చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్ధులు సోమవారం నుంచి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆయా విభాగాల్లో రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి మొదలవుతుందనే వివరాలు ఇలా ఉన్నాయి.
భారత సైన్యం జూన్ 20, 2022
వాయుసేన జూన్ 24, 2022
నావికా దళం జూన్ 21, 2022
అగ్నిపథ్ స్కీంపై భారత సైన్యం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల అవుతుందని అంతకుముందు ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొనప్ప విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆపై జులై 1 నుంచి వాయుసేన, నావికా దళాలు నోటిపికేషన్ జారీ చేస్తాయని తెలిపారు. అగ్నివీరుల కోసం నోటిపికేష్ వివరాలు రక్షణ దళాల అధికారిక వెబ్సైట్లో అతిత్వరలో అందుబాటులో ఉంటాయి.