గౌహతి: అస్సాం(Assam Violence) రాష్ట్రంలోని పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించారు. శాంతి, భద్రతల నేపథ్యంలో ఆ ఆంక్షలు అమలు చేస్తున్నారు. జిల్లా మెజిస్ట్రేట్ నిరోలా పాంగ్చోపీ ఆ నిషేధ ఆజ్ఞలు జారీ చేశారు. డిసెంబర్ 22వ తేదీ నుంచి జిల్లాలో సెక్షన్ 163 కింద ఆంక్షలు అమలు అవుతున్నట్లు చెప్పారు. మత, వర్గ విద్వేషాలకు తావుఇవ్వకుండా ఉండే రీతిలో, ప్రజా ప్రాపర్టీకి ధ్వంసం కలగకుండా చూసేందుకు ఆ బృందానికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సోమవారం జరిగిన నిరసన ప్రదర్శనపై పోలీసులు ఫైరింగ్ చేపట్టారు. ఆ కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. గ్రేజింగ్ రిజర్వ్ ల్యాండ్లో ఆక్రమణలను అడ్డుకుంటూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. వారిని చెదరగొట్టే సమయంలో పోలీసులు కూడా గాయపడ్డారు. కర్బి ఆంగ్లాంగ్ ఆటానమస్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తులీరామ్ రోహంగాంగ్ ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టడంతో డొంకమోకంలో పరిస్థితి అదుపు తప్పింది.
అయితే ఇండ్లల్లో చెలరేగిన మంటల్ని అగ్నిమాపక సిబ్బంది ఆర్పేసింది. 12 రోజులు జరుగుతున్న ఆమరణ దీక్షను చెదరగొట్టే క్రమంలో తొలుత ఖేరోనిలో విధ్వంసం జరిగింది. ప్రొఫెషనల్ గ్రేజింగ్ రిజర్వ్(పీజీఆర్), విలేజ్ గ్రేజింగ్ రిజర్వ్(వీజీఆర్) భూముల ఆక్రమణను అడ్డుకోవాలని కోరుతూ నిరసనకారులు డిమాండ్ చేశారు.