రోమ్: ప్రపంచవ్యాప్తంగా సరగసీ(అద్దె గర్భం) మాతృత్వ విధానాన్ని నిషేధించాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. ‘పుట్టబోయే బిడ్డ ప్రాణాలను రక్షించాలి. బిడ్డలను అణిచివేయకూడదు. అక్రమ రవాణా వస్తువుగా మార్చకూడదు. స్త్రీ, పిల్లల గౌరవానికి తీవ్రమైన భంగం కలిగించే సరగసీ మాతృత్వాన్ని నేను జుగప్సాకరంగా భావిస్తాను’ అని రోమ్‌లో తన వార్షిక ప్రసంగంలో పేర్కొన్నారు.