అమేథీ: పేదలకు ఉచితంగా పంపిణీ చేసే ఆహార ధాన్యాలపై యూపీలోనీ బీజేపీ ప్రభుత్వానికి ఎంత పట్టింపు ఉందో తెలియజెప్పే ఘటన ఇది. అమేథీలో ఉచిత రేషన్‌లో పంపిణీ చేసిన ఆహార ధాన్యాల్లో మట్టిపెడ్డలు, ఉప్పుగడ్డలు దర్శనమిచ్చాయి. కల్తీ రేషన్‌పై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సంజయ్ చౌహన్ జలాల్పూర్ తివారీ గ్రామంలోని రేషన్ దుకాణాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి బస్తాల్లో మట్టి బెడ్డలు, ఉప్పుగడ్డలు కనిపించడంతో కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. కల్తీ బస్తాలను మార్చి మెరుగైన వాటిని పంపిణీ చేయాలని జిల్లా ఆహార, మార్కెటింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు.