Cooking Oil | న్యూఢిల్లీ: వంట నూనెల్లో ప్రమాదకరమైన జీఈ, 3-ఎంసీపీడీ కలుషితాలు పరిమితికి మించకుండా చూడాలని, ఈ విషయంలో ఇటీవల యూరోపియన్ యూనియన్లో తీసుకువచ్చిన ప్రమాణాలను మన దేశంలోనూ పరిగణలోకి తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.
గ్లెసిడైల్ ఈస్టర్(జీఈ), 2-మోనోక్లోరోప్రొపేన్-1, 2-డయోల్ ఈస్టర్(3-ఎంసీపీడీ) అధికంగా ఉండటం ఆరోగ్యానికి హానికరమని, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు ఇవి దారి తీస్తాయని చెప్తున్నారు. వినియోగదారుల ఆరోగ్యాలను కాపాడటం కోసం ఆహారంలో జీడీ, 3-ఎంసీపీడీపై పరిమితి విధిస్తూ యూరోపియన్ యూనియన్ పలు ప్రమాణాలను అమలు చేస్తున్నదని మేదాంత హాస్పిటల్ చైర్మన్, కార్డియాలజీ హెడ్ డాక్టర్ ప్రవీణ్ చంద్ర తెలిపారు. భారత్లో కూడా కొత్త నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు.