బీజేపీకి అదానీ పవిత్ర ఆవు.. ‘గోవు హగ్ డే’ నోటీసుపై సంజయ్ రౌత్
‘బీజేపీకి అదానీ పవిత్రమైన ఆవు. అందుకే, వారు తమ పవిత్రమైన ఆవును కౌగిలించుకున్నారు. ప్రేమికుల రోజున మేము హగ్ చేసుకునేందుకు ఇతర ఆవులను మాకు వదిలేశారు’ అని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ బీజేపీకి పవిత్రమైన ఆవు అని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకుడు, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. వాలంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14ను ‘గోవు హగ్ డే’గా జరుపుకోవాలని ప్రజలను కోరుతూ జంతు సంక్షేమ బోర్డు ఇటీవల జారీ చేసిన నోటీసుపై ఆయన స్పందించారు. ‘బీజేపీకి అదానీ పవిత్రమైన ఆవు. అందుకే, వారు తమ పవిత్రమైన ఆవును కౌగిలించుకున్నారు. ప్రేమికుల రోజున మేము హగ్ చేసుకునేందుకు ఇతర ఆవులను మాకు వదిలేశారు’ అని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. అయితే తాము ఆవును గోమాతగా గౌరవిస్తామని చెప్పారు. గోవుపై తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేకమైన రోజు అవసరం లేదని అన్నారు.
కాగా, అదానీ కంపెనీల షేర్లలో అవకతవకలు జరిగినట్లు హిండెన్బర్గ్ పరిశోధన నివేదిక పేర్కొంది. దీంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఈ అంశం కుదిపేస్తున్నది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసం కోల్పోయేలా చేసిన గౌతమ్ అదానీ కంపెనీలపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలతోపాటు ప్రధాని మోదీ, అదానీకి మద్దతుగా పార్లమెంట్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
आम्हाला मिठ्या मारायला गायी दिल्या आहेत आणि ते अदानी नावाच्या ‘होली काऊ’ला मिठ्या मारतायत, संजय राऊतांचा पंतप्रधान मोदींना टोला. @rautsanjay61 #CowHugDay #SanjayRaut #NarendraModi #GautamAdani pic.twitter.com/7uAKDc9how
— Maharashtra Times (@mataonline) February 9, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- adani
- BJP
- Cow Hug Day
- holy cow
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

