న్యూఢిల్లీ: అందాల తార సుష్మితాసేన్ తన దత్తపుత్రిక అలీసాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇన్స్టా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తన కూతురుతో దిగిన పలు ఫొటోలను షేర్ చేసింది. ఫొటోలతో పాటు కూతరుపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ కామెంట్స్ రాసుకుంది. హ్యాప్పీ 13th బర్త్డే టు ది లవ్ ఆఫ్ మై లైఫ్ అని మొదలుపెట్టి.. కూతురుపై ప్రశంసలు కురిపించింది.
అలీసాకు తల్లిని అయినందుకు తనకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉన్నదని పేర్కొన్నది. దేవుడు తన బిడ్డను చల్లగా చూడాలని ప్రార్థించింది. ఇక సుష్మితాసేన్ పెద్ద కూతురు రేనీ కూడా తన సోదరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. హ్యాప్పీ 13th బర్త్ డే లిటిల్ మఫిన్ అంటూ మొదలు పెట్టి తన ఇన్స్టా హ్యాండిల్లో విషెష్ రాసుకొచ్చింది.
కాగా, అలీసా, రేనీ ఇద్దరూ సుష్మితాసేన్ కన్నబిడ్డలు కాదు. వాళ్లిద్దరినీ ఆమె దత్తత తీసుకుంది. అలీసాను 2010లో దత్తత తీసుకోగా, రేనీని అంతకుమునుపే ఆమెకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు దత్తతకు తెచ్చుకుంది.