Bengal CM : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి జయకేతనం ఎగురవేసిన భారతీయ జనతా పార్టీ(BJP) సంబురాల్లో మునిగితేలుతోంది. కమ్యూనిస్టులు.. ఆపై తృణమూల్ కాంగ్రెస్(TMC)కు కంచుకోటలా మారిన బెంగాల్లో సంపూర్ణ ఆధిపత్యంతో అధికారాన్ని ఏర్పాటు చేయబోతోంది. మమతా బెనర్జీ పార్టీని షాక్కు గురి చేస్తూ.. భారీ విజయంతో కాషాయ పాలనకు నాంది పడిన వేళ.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అనేది ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే.. పార్టీ సంచలన విజయానికి కృషి చేసిన నలుగురు నేతలు సీఎం రేసులో ఉన్నారు.
బెంగాల్లో అధికారాన్ని ఛేజిక్కించుకోవడం ఏళ్లుగా నిరీక్షించిన బీజేపీ కల సాకారమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటకు సమాయత్తమవుతోంది. అయితే.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అనేది ఉత్కంఠ రేపుతోంది. అందుకు కారణం.. ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ మాదిరిగా బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు వెళ్లలేదు. ప్రధాని నరేంద్ర మోడీ అన్నీతానై వ్యవహరిస్తూ మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడారు. దాంతో.. ముఖ్యమంత్రిగా సీనియర్లకు అవకాశమిస్తారా? లేదా బెంగాలీవాసికే పట్టం కడుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
Who will be the next CM of West Bengal? Speculations mount as BJP consolidates lead#BJP #WestBengal #BengalElections https://t.co/Xi9vKwMZoL
— News9 (@News9Tweets) May 4, 2026
సీఎం పదవికి పోటీదారులుగా మహాభారత్ సిరీస్లో ద్రౌపది పాత్రతో సుపరిచితమైన నటి రూపా గంగూలీ (Roopa Ganguly), మహిళా నాయకురాలు అగ్నిమిత్ర పౌల్, సీనియర్ నాయకుడు సువెందు అధికారి, రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ఉన్నారు. వీరితో పాటు నిశిత్ ప్రమాణిక్, ప్రజాదారణ కలిగిన దిలీప్ ఘోష్(Dilip Ghosh) సీఎం కుర్చీని ఆశిస్తున్నారు. ఈ ఆరుగురిలో ఎవరిని బీజేపీ తమ తొలి ముఖ్యమంత్రిని చేస్తుంది? అనేది రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది.
ఎన్నికల ప్రచారం వేళ హోమంత్రి అమిత్ షా బీజేపీకి ఓటేస్తే.. బెంగాలీని సీఎం చేస్తాం అని హామీ ఇచ్చారు. దాంతో.. షా మాట ఇచ్చినట్టు బెంగాలీవాసికి పట్టాభిషేకం చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. కేంద్రమంత్రి సుకంతా ముజుందార్ మాట్లాడుతూ.. మాంసాహారం తినే వ్యక్తి తదుపరి బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతారు అని బీజేపీ గెలిస్తే మాంసం, చేపలు తిననివ్వరు అని ఎన్నికల సందర్భంగా ప్రజలను భయపెట్టిన మమతకు కౌంటర్ ఇచ్చారు.
“TMC has destroyed Bengal with its ‘cut-money’ politics.
Mamata Banerjee wants to protect infiltrators, BJP wants to ‘detect, delete and deport’ illegal immigrants.
People are suffering, but Mamata is more interested in making her nephew next CM of Bengal.”
– HM Amit Shah at… pic.twitter.com/vHprlDk6G8
— News Arena India (@NewsArenaIndia) April 10, 2026
అసెంబ్లీ ఎన్నికల్లో సోనాపూర్ దక్షిణ నియోజక వర్గం నుంచి రూపా గంగూలీ, అసాన్సోలో సీటు నుంచి అగ్నిమిత్ర, నందిగ్రామ్ నుంచి సువెందు, ఖరగ్పూర్ సదర్ నుంచి దిలీప్ ఘోష్ గెలుపొందారు. ఈ నలుగురూ బెంగాలీలే కావడంతో.. ఈ చతుష్టయంలో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని విశ్లేషకులు అంటున్నారు.