Mahesh Babu | విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 100కుపైగా స్థానాల్లో అధిక్యాన్ని ప్రదర్శించి తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. మొదటి ప్రయత్నంలోనే విక్టరీ విజయాన్ని కైవసం చేసుకుని ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్‌కు టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాని ఇప్పటికే శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు తన ప్రియమైన స్నేహితుడైన విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు.
సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేసి.. అద్భుతమైన విక్టరీని అందుకున్న విజయ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజలు మీపైన పెట్టుకున్న అపారమైన విశ్వాసాన్ని ఈ రోజు ప్రతిబింబిస్తోంది. ఈ సక్సెస్ తమిళనాడుకు అర్థవంతమైన పురోగతిని అందిస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నానని ట్వీట్ చేశాడు మహేశ్ బాబు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
చాలా కాలంగా ఇండస్ట్రీలో విజయ్, మహేశ్ బాబు మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతుందని తెలిసిందే. ఈ ఇద్దరికి రెండు రాష్ట్రాల్లో కూడా అభిమానులున్నారు. విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేశ్ బాబు ట్వీట్ చేయడంతో ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు.
Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻
Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️
— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2026