Actor Vijay : ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు (TVK party chief) విజయ్ (Vijay) రేపు (సోమవారం) కరూర్ తొక్కిసలాట (Karur stampede) బాధితులను కలువనున్నారు. మలప్పురం (Malappuram) లోని ఓ ప్రైవేట్ హోటల్ (Private hotel) లో బాధిత కుటుంబాలతో సమావేశం కానున్నారు. ఉదయం 7.30 గంటలకే సమావేశం ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కరూర్తోపాటు ఇతర జిల్లాల్లో ఉన్న బాధిత కుటుంబాలను ప్రత్యేక బస్సుల్లో హోటల్‌కు తీసుకురానున్నట్లు టీవీకే పార్టీ వెల్లడించింది. సమావేశంలో విజయ్ ఒక్కో కుటుంబంతో విడివిడిగా మాట్లాడుతారని తెలిపింది. అయితే ఈ ప్రైవేట్ సమావేశానికి మీడియాకు అనుమతి లేదని పేర్కొంది. దీనిపై పోలీసులను ఆరాతీయగా అది ఇండోర్ ప్రోగ్రామ్ అని చెప్పారు.
ముందుగా విజయ్ ఒక్కో బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లేలా ప్లాన్ చేసినా ప్రయాణం సమస్యగా మారుతుందనే ఉద్దేశంతో అందిరినీ ఒకేచోటుకు పిలిచి మాట్లాడాలని నిర్ణయించారు. కాగా ఈ దీపావళి పండుగకు ముందే విజయ్ ఒక్కో బాధిత కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త పార్టీని స్థాపించి ప్రచారం మొదలుపెట్టిన విజయ్ తొలి ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. మొత్తం 41 మంది తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.